Helping Verbs

www.goodenglishblog.com







Want to:

ప్రస్తుతం గాని భవిషత్తులో చేయాలనుకుంటున్న పనులను తెలియచేయుటకు "Want to" అనే Helping verb ను ఉపయోగిస్తాం.

EXAMPLES

I want to meet you tomorrow. ( నేను రేపు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను )

They want to eat something now. ( వారు ఇప్పుడు ఏదైనా తినాలనుకుంటున్నారు )

She wants to become a designer in future. ( ఆమె భవిషత్తులో డిజైనర్ కావాలనుకుంటుంది )

She wants to get married. ( ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటుంది )

....................................................

Wanted  to:

గతంలో చేయాలనుకున్న పనులను తెలియచేయుటకు "Wanted  to" అనే Helping verb ను ఉపయోగిస్తాం.

EXAMPLES

I wanted  to meet you yesterday.
( నేను నిన్న మిమ్మల్ని కలవాలనుకున్నాను )

They wanted to go to khammam day before yesterday .
( వారు మొన్న  ఖమ్మం వెళ్ళాలనుకున్నారు )

She wanted to become a designer, when she was 18.
( ఆమె 18వ  సం.. లో ఉండగా డిజైనర్ కావాలనుకుంది)

....................................................

Used  to:
గతంలో అలవాటుగా చేసి.... ప్రస్తుతం చేయటం లేదు అని చెప్పటానికి   " Used to" అనే Helping verb ను ఉపయోగిస్తాం.

EXAMPLES

I used to smoke. ( నేను పొగ తాగేవాడిని )

They used to watch tamil movies . ( వారు తమిళ్ సినిమాలు చూసేవారు )

She used to eat pan masala. ( ఆమె పాన్ మసాలా తినేది )

....................................................

Have to:

ప్రస్తుతం గాని, భవిషత్తులో చేయాల్సిన  పనులను తెలియచేయుటకు "Have  to"  అనే Helping verb ను ఉపయోగిస్తాం.

EXAMPLES

I have to meet my friend. ( నేను నా ఫ్రెండ్ ని కలవాలి )

They have to go to nizamabad. ( వారు నిజామాబాద్ వెళ్ళాలి )

She has to leave now . ( ఆమె ఇప్పుడు వెళ్ళాలి )

....................................................


Had to:

గతంలో చేయాల్సివచ్చింది అని తెలియచేయుటకు  " Had  to"  అనే Helping verb ను ఉపయోగిస్తాం.

EXAMPLES

I had to meet my enemy. ( నేను నా శత్రువును  కలవాల్సివచ్చింది . )

We had to wait ther for him. ( మేము అతని కొరకు వేచి వుండల్సి వచ్చింది )

She had to oppose her husband . ( ఆమె తన భర్తను ఎదురించాల్సి  వచ్చింది )

....................................................


Need  to:

చేయాల్సిన  అవసరం ఉందని  తెలియచేయుటకు  " Need  to"  అనే Helping verb ను ఉపయోగిస్తాం.

EXAMPLES

I need to go to dwaraka nagar. ( నేను ద్వారకానగర్ కు వెళ్ళాల్సిన  అవసరం వుంది )

We need to wait  for him. ( మేము అతని కొరకు వేచి వుండే అవసరం వుంది )

She needs to  learn english . ( ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం వుంది )

....................................................


Going   to:

ఒక పనిని చేయబోతున్నామని    తెలియచేయుటకు  " Going  to"  అనే Helping verb ను ఉపయోగిస్తాం.

EXAMPLES

Iam going to meet my uncle. ( నేను నా మామయ్య ను కలవబోతున్నాను )

They are going to explain something  . ( వారు ఏదో  వివరణ ఇవ్వబోతున్నారు )

She is going to  marry.. ( ఆమె పెళ్లి చేసుకోబోతుంది )

....................................................


Would like to:

మన అభిప్రాయాలను మర్యాదపూర్వకంగా తెలియచేయుటకు  " Would like  to"  అనే Helping verb ను ఉపయోగిస్తాం.

EXAMPLES

I would like to introduce myself . ( నేను నా గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను )

They  would like to explain something  . ( వారు ఏదో  వివరణ ఇవ్వాలనుకుంటున్నారు  )

She  would like to take a permission. ( ఆమె అనుమతి తీసుకోవాలనుకుంటుంది )

....................................................


Might have:

జరిగిపోయిన పనులను, ఉహించి చెప్పే సమయములో   " Might have "  అనే Helping verb ను
ఉపయోగిస్తాం.

EXAMPLES

He  might have gone to secendrabad.  ( అతను సికింద్రాబాద్ కు వెళ్లి ఉండవచ్చు )

They might have visited indira park. ( వారు ఇందిరా పార్క్ ను సందర్శించి ఉండవచ్చు   )

She  might have seen me yesterday. ( ఆమె నన్ను నిన్న చూసి  ఉండవచ్చు )

....................................................



Would  have:
నేను చేసేవాడిని , పూర్తి చేసేవాడిని  అని తెలుపుటకు " Would have "  అనే Helping verb ను ఉపయోగిస్తాం.

EXAMPLES

He  woud have gone to secendrabad.  ( అతను సికింద్రాబాద్ కు వెళ్లి ఉండేవాడు  )

They would have visited indira park. ( వారు ఇందిరా పార్క్ ను సందర్శించి ఉండేవారు  )

She  would have seen me yesterday. ( ఆమె నన్ను నిన్న చూసి  ఉండేది  )
....................................................


Should  have:

చేసి ఉండాల్సింది, చేసి ఉంటే బాగుండేది అని తెలియ చేయుటకు   " Should  have "  అనే Helping verb నుఉపయోగిస్తాం.

EXAMPLES

He should  have gone to secendrabad.  ( అతను సికింద్రాబాద్ కు వెళ్లి ఉండాల్సింది  )

They should have visited indira park. ( వారు ఇందిరా పార్క్ ను సందర్శించి ఉండాల్సింది  )

She should have told  me yesterday. ( ఆమె నాకు  నిన్న చెప్పి  ఉండాల్సింది )

....................................................



Must have:

చేసి ఉంటాను , తప్పకుండా చేసి ఉంటాను అని తెలియ చేయుటకు   " Must  have "  అనే Helping verb నుఉపయోగిస్తాం.

EXAMPLES

He must  have gone to secendrabad.  ( అతను సికింద్రాబాద్ కు వెళ్లి ఉంటాడు )

They must  have visited indira park. ( వారు ఇందిరా పార్క్ ను సందర్శించి ఉంటారు )

She must have told  me yesterday. ( ఆమె నాకు నిన్న చెప్పి ఉంటుంది  )

....................................................



Will be :

భవిషత్తులో ఒక చోట ఉంటాను మరియు రేపటి గురుంచి మాట్లాడే విషయం లో   " Will  be "  అనే Helping verb నుఉపయోగిస్తాం.

EXAMPLES

It will be completed by tomorrow. ( ఇది రేపు సాయంత్రానికి  పూర్తి  అవుతుంది )

They will be in secendrabad tomorrow. ( వారు సికింద్రాబాద్ లో ఉంటారు   )

She will be busy day after tomorrow. ( ఆమె ఎల్లుండి బిజీ గా ఉంటుంది  )
....................................................

No comments:

Post a Comment

English Books :