Monday, 31 March 2014

I will call you today night...ఈ వాక్యం కరెక్టేనా?


I will call you today night.
I will call you tonight. ( correct )
(ఈ రోజు రాత్రి నేను కాల్ చేస్తాను.)

My brother is coming today night from Goa.
My brother is coming tonight from Goa. (correct)

I will call you today night అని చెప్పిన ఎదుటి వారికి అర్థం అవుతుంది, కానీ అలా చెప్పటం
ద్వారా మీ ఇంగ్లీష్ బలహీనత ఎదుటి వారికి అర్థం అవుతుంది.

Sunday, 30 March 2014

మీ ఫ్రెండ్ కెమెరాలో బందించిన ఫోటోను పేస్ బుక్ లో పెట్టి ఎలా వుందో... కామెంట్స్ చేయండి అంటే...? ఇలా కామెంట్స్ చేయండి.

( ఫోటో అద్బుతంగా వుంటే... మీరు ఈ క్రింది వాటిలో ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది. )

Fabulous Shot!!
Incredibly beautiful..
That's amazing!
Absolutely magical and splendid!
So amazing Great moment.
This is so unusual!
awesome!

No words to say...
Inspiring and perfect
Un remarkable.
Great image.
It is extraordinary.
Magnificent...

Very beautiful. Impressive.
10 out of 10!
Wow!this one is stunning..

Saturday, 29 March 2014

Vegetarian అంటే మీకు తెలుసు.. Eggetarian అంటే ఏమిటి? ఏంటి వీటి మధ్య తేడా?

Vegetarian VS Eggetarian 

Vegetarian : శాకాహారి.   a person who does not eat meat or fish, and sometimes other animal products. 

Eggetarian : ( Eggetarian అంటే... Egg  + Vegetarian )  It's  a type of vegetarianism which allows for the consumption of eggs;

She is a vegetarian (ఆమె శాకాహారి)

he is an eggetarian ( అతడు
శాకాహారే... కానీ గుడ్డు  తింటాడు. మాంసం ముట్టుకోడు)

Friday, 28 March 2014

అతన్ని కాకా పడుతూనే ఉన్నాడు.. కాకా పట్టడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు?

Curry favour : కాకా పట్టడం . To attempt to gain favour or ingratiate oneself,
by officious courtesy or flattery.

Why do you curry favour with me? I can't do that wihout her help.
నన్నెందుకు కాకా పడతావు? ఆమె సహాయం లేకుండా అది నేను చేయలేను.

Revanth  has been currying favour with him for 1hour.
గంట నుండి రేవంత్ అతన్ని కాకా పడుతూనే ఉన్నాడు.  

Thursday, 27 March 2014

చింతకాయ పచ్చడిని చుస్తే చాలు.. నా నోరూరుతుంది.. నోరురటంను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Mouth waters : నోరురటం. to make someone hungry (for something);
to cause saliva to flow in someone's mouth.

When i see sweets, my mouth waters.
స్వీట్స్ ను చూసినపుడు.. నా నోరూరుతుంది.

Mouth watering bakery items.
నోరూరించే బేకరి ఐటమ్స్.

If i see tamarind pickle, my mouth waters.
చింతకాయ పచ్చడి ని చుస్తే చాలు.. నా నోరూరుతుంది. 

Wednesday, 26 March 2014

దూరపు బంధువును ఇంగ్లీష్ లో ఏమంటారు?

Distant Relative : దూరపు బంధువు.

I don't have much contacts with her family.
నాకు ఆమె ఫ్యామిలి తో  పెద్ద సంబంధాలు లేవు. 

She is a distant relative of mine.
ఆమె నాకు దూరపు బంధువు. 

They are our distant relatives.
వారు మాకు దూరపు బంధువులు. 

Once in a blue moon, they visit our home.
ఎప్పుడో ఒకసారి, వారు మా ఇంటికి వస్తారంతే. 

Tuesday, 25 March 2014

అది చెప్పుకోలేని భయమా... ఏంటది? చెప్పుకోలేని భయాలను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Unspoken fears: చెప్పుకోలేని భయాలు.

చెప్పుకోలేని భయాలకు " Unspoken fears" ని ఉపయోగిస్తాం.

Is that a unspoken fear.. what's that?
అది చెప్పుకోలేని భయమా... ఏంటది?

Whom do i tell about my unspoken fears?
చెప్పుకోలేని భయాలను ఎవరికీ చెప్పుకోవాలిరా బాబు?

Monday, 24 March 2014

కాల కృత్యాలు...... ఈ పదాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు?

Ablutions : కాల కృత్యాలు 

చాలా మందికి  కాల కృత్యాలకు  ఏ పదం ఉపయోగించాలో అర్థం కాదు. ఈ  Ablutions (noun ) అనే పదాన్ని use చేస్తే సరిపోతుంది .

I  complete my ablutions before 7 a.m. 


Sunday, 23 March 2014

Kiss the dust...ని తెలుగు లో ఏమంటారు?

Kiss the dust : To be defeated, ఓడిపోవటం. 

You definitely kiss the dust.
నీవు తప్పక ఓడిపోతావు.

Don't underestimate him. You will kiss the dust.
అతన్ని తక్కువ అంచనా వేయకు. నీవు ఓడిపోతావు. 

Saturday, 22 March 2014

Half hearted....ని తెలుగులో ఏమంటారు?

Half hearted : not interested, ఇష్టం లేని.

Why do you do half hearted work.
ఇష్టం లేని పనిని నీవెందుకు చేస్తావు?

I don't need to do half hearted work.
ఇష్టం లేని పనిని చేసే అవసరం నాకు లేదు .

I can't do half hearted work.
ఇష్టం లేని పనిని నేను చేయలేను. 

Friday, 21 March 2014

వాడు ఖచ్చితంగా నిన్న అక్కడ ఉండే ఉంటాడు. ఇంగ్లీష్ లో ఎలా?

ఇక్కడ మనం " Must have" అనే helping verb ని ఉపయోగిస్తాం.
When expressing a personal opinion in the past, we use 'must have'.

He must have been there yesterday.
వాడు ఖచ్చితంగా నిన్న అక్కడ ఉండే ఉంటాడు. 

I must have called him yesterday.
నిన్న నేను  అతనికి కాల్ చేసే వుంటాను.

Thursday, 20 March 2014

నేను నా మాటను నిలబెట్టుకున్నాను.. ఇంగ్లీష్ లో ఎలా?

Keep my word : మాట నిలబెట్టుకోవటం. 

I have kept my word. will you?
నేను నా మాటను నిలబెట్టుకున్నాను.. మరి నీవు?

Don't worry. I will definitely keep my word.
వర్రీ అవకు. నేని తప్పని సరిగా నా మాటను నిలబెట్టుకుంటాను.   

Wednesday, 19 March 2014

Why don't he get married? ఇది కరెక్టేనా?

Why don't he get married? ( X )

Why doesn't he get married? ( కరెక్ట్ )
ఆతను ఎందుకు పెళ్లి చేసుకోడు ?

Because... The term 'don't' applies when discussing a plural subject.

Example:

Why don't they get married? ( correct )
వారు ఎందుకు పెళ్లి చేసుకోరు? 

Tuesday, 18 March 2014

ఆమె ఎల్లుండి బిజీ గా ఉంటుంది...ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Will be :
భవిషత్తులో ఒక చోట ఉంటాను మరియు రేపటి గురుంచి మాట్లాడే విషయం లో   " Will  be "  అనే Helping verb నుఉపయోగిస్తాం.

EXAMPLES

It will be completed by tomorrow. ( ఇది రేపు సాయంత్రానికి  పూర్తి  అవుతుంది.)
They will be in Hyderabad tomorrow. ( వారు రేపు  హైదరాబాద్ లో ఉంటారు. )
She will be busy day after tomorrow. ( ఆమె ఎల్లుండి బిజీ గా ఉంటుంది. )

Monday, 17 March 2014

Cloud9... ఈ పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం?

Cloud 9 : Very happy.

Cloud9  అంటే చాలా సంతోషం . ఈ  పదాన్ని అప్పుడప్పుడు ఉపయోగించండి .  

I got a  job in Facebook. I am in clould9.
I am going to marry my girl friend. i am in cloud9.


 

Sunday, 16 March 2014

ఆమె నన్ను నిన్న చూసి ఉండవచ్చు... ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Might have:
జరిగిపోయిన పనులను, ఉహించి చెప్పే సమయములో   " Might have "  అనే Helping verb ను
ఉపయోగిస్తాం.

EXAMPLES

He  might have gone to secendrabad.  ( అతను సికింద్రాబాద్ కు వెళ్లి ఉండవచ్చు.  )

They might have called me yesterday. ( వారు నాకు నిన్న  కాల్ చేసి ఉండవచ్చు. )

She  might have seen me yesterday. ( ఆమె నన్ను నిన్న చూసి  ఉండవచ్చు.  )


Saturday, 15 March 2014

ఆమె పెళ్లి చేసుకోబోతుంది...ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Going  to:
ఒక పనిని చేయబోతున్నామని  అని తెలియచేయుటకు " Going to " అనే Helping verb ను ఉపయోగిస్తాం.

EXAMPLES

I am going to meet my uncle. ( నేను నా మామయ్య ను కలవబోతున్నాను.  )

They are going to explain something about share market  .
( వారు ఏదో షేర్ మార్కెట్ గురించి వివరణ ఇవ్వబోతున్నారు.  )

She is going to  marry.. ( ఆమె పెళ్లి చేసుకోబోతుంది. 

Friday, 14 March 2014

భరించలేనంత వేడిగా వుంది అని చెప్పటానికి... Very Vs Too

Very Vs Too

It's very hot. ( ఇది Simple Statement. వేడిగా వుంది అని చెప్పటానికి..)
It's too hot. ( ఇది Negative Statement. భరించలేనంత వేడిగా వుంది అని చెప్పటానికి..)

Abhinav is very tall.( ఇది Statement. మంచిగా ఎత్తుగా వున్నాడు అని చెప్పటానికి.. )
Abhinav is too tall.( ఇది Negative Statement. ఉండవలసిన దానికన్నా చాలా 
ఎత్తుగా వున్నాడు అని చెప్పటానికి..)


Thursday, 13 March 2014

నీవు నిన్న గుర్తు చేసి ఉండాల్సింది... ఇంగ్లీష్ లో ఎలా?

ఇలాంటి సందర్భం లో Should have అనే helping verb ను వాడుతాం.

I forgot bringing that. You should have remembered me yesterday .
అది తీసుక రావటం మర్చిపోయాను. నీవు నిన్న గుర్తు చేసి ఉండాల్సింది. 
 
I should have gone to the market yesterday.
నేను నిన్న మార్కెట్ వెళ్లి ఉండాల్సింది. 

Wednesday, 12 March 2014

ఖచ్చితమైన స్థలాన్ని చెబుతున్నపుడు... ఎలా చెప్పాలి?

ఖచ్చితమైన స్థలాన్ని చెబుతున్నపుడు... at అనే Preposition ని ఉపయోగిస్తాం.

I am waiting at mukund hotel.
ముకుంద్ హోటల్ వద్ద నేను wait చేస్తున్నాను.

Daily we meet at karuna bakery.
రోజు మేము కరుణ bakery వద్ద కలుస్తాం. 

Tuesday, 11 March 2014

Close friend నీ ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసా?

Chum : A close friend. 

Mom, she is my one of my chums.
అమ్మ, ఆమె నా close friends లో ఒకరు. 

She shares her feelings with chums.
ఆమె తన భావాలను close friends తో పంచుకుంటుంది. 

Monday, 10 March 2014

వారు మళ్ళీ గుసగుసలు మొదలుపెట్టారు.గుసగుసలాడటాన్ని..ఇంగ్లీష్ లో ఏమంటారు?

Whisper : గుసగుసలాడటం, speak very softly using one's breath rather than one's throat, 
especially for the sake of secrecy.

She is whispering in his ear something .
ఆమె  ఏదో అతని చెవిలో గుసగుసలాడుతుంది.

They are whispering something about our company.
వారి ఏదో మన కంపెనీ గురించి గుసగుసలాడుతున్నారు.

They started whispering again.
వారు మళ్ళీ గుసగుసలు మొదలుపెట్టారు.

Sunday, 9 March 2014

She go to the temple everyday. ఈ వాక్యం లో తప్పు ఏముంది?

She go to the temple everyday.  ఈ వాక్యం తప్పు.

She goes to the temple everyday. (కరెక్ట్ )
ఆమె రోజు గుడికి వెళ్తుంది.

Does she go to the temple everyday ?
ఆమె ప్రతిరోజూ గుడికి వెళ్తుందా?

Doesn't she go to the temple everyday ?
ఆమె ప్రతిరోజూ గుడికి వెళ్ళదా?


Saturday, 8 March 2014

చక్కిలిగింతను ఇంగ్లీష్ లో ఏమంటాం?

Tickle : చక్కిలిగింత పెట్టు. 

Please don't tickle me?
Please..చక్కిలిగింత పెట్టకు. 

I tickled him under the ears.
నేను అతని చెవి క్రింద చక్కిలిగింత పెట్టాను.

Her touch ticking me slightly.
ఆమె టచ్ నాకు చక్కిలిగింతలు పెట్టింది.  

Thursday, 6 March 2014

బాధను దిగమింగుకొని సంతోషంగా ఉండటాన్ని...ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి ?

Laugh away : (బాధను దిగమింగుకొని సంతోషంగా వుండటం )
To treat a serious problem lightly by laughing at it. 


 Although her feelings were hurt, she just laughed away as if nothing had happened.
 ఆమె చాలా బాధలో ఉన్నప్పటికీ, ఏమి జరగలేదన్నట్లు... బాధను దిగమింగుకొని సంతోషం గా వుంది.


Wednesday, 5 March 2014

దిష్టిబొమ్మ లాగా నీవు ఎందుకు నిల్చుంటావు... దిష్టిబొమ్మను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Effigy(ఎఫిజి) : దిష్టిబొమ్మ, a sculpture or model of person.

Why do you stand in front of the gate like effigy?
గేటు ముందు దిష్టిబొమ్మ లాగా నీవు ఎందుకు నిల్చుంటావు ?

The minister was burned in effigy.
మంత్రి దిష్టిబొమ్మను తగలబెట్టారు.  

Tuesday, 4 March 2014

వేరే వారి మీద చాడీలు చెపుకుంటూ.. చాడీలు చెప్పటంను ఇంగ్లీష్ లో ఏమంటాం?

Back biting (n) : చాడీలు చెప్పటం. Malicious talk about someone who is not present.

Please avoid back biting.
దయచేసి చాడీలు చెప్పకు.

We shouldn't waste our time in back biting about others.
ఇతరుల మీద చాడీలు చెపుకుంటూ.. మన సమయం వృధా చేసుకోకూడదు. 


Monday, 3 March 2014

ఆఫీసులో పని చేయకుండా... ఇంటర్నెట్ లో స్వంత పనులను చేసే వారిని ఏమంటారో తెలుసా?

Cyber loaf : Spend time on the internet at work doing personal things.
ఆఫీసు లో పని చేయకుండా... ఇంటర్నెట్ లో స్వంత పనులను చేసే వారు.

He is a cyber loaf, can he finish this project by tomorrow?
వాడు వాని స్వంత పనులే ఇంటర్నెట్ లో చేసుకుంటాడు, రేపటికి ఈ ప్రాజెక్ట్ పనిని ఆతను పూర్తి చేస్తాడా?

Sunday, 2 March 2014

What did you ate yesterday? ఈ వాక్యం కరెక్టేనా ?

What did you ate yesterday?  ఈ వాక్యం తప్పు .

I ate onion pakoda yesterday.
ఈ sentence question form:
What did you eat yesterday?

పూర్తి వివరణకు ఈ TENSES చూడండి.

Saturday, 1 March 2014

లంచ్ అంటే మీకు తెలుసు... మరి BRUNCH అంటే ఏమిటి?

Brunch : Late morning meal eaten instead of breakfast and lunch.

Breakfast కి Lunch మధ్య తినటాన్ని Brunch అంటారు.

Kumar..shall we go for lunch?
కుమార్... లంచ్ కి వెళ్దామా?

I got up late so i had brunch.
నేను ఆలస్యంగా లేచాను... నేను తినేసాను.

English Books :