Friday, 28 February 2014

వడియాలను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Fryams : వడియాలు. 

Everyone likes fryams.
వడియాలను అందరు ఇష్టపడతారు.

Besides fryams, what do you like most?
వడియాలు  కాకుండా.. ఇంకా ఏదంటే నీకు చాలా ఇష్టం?

I like vermicelli upma.
నాకు సేమ్యా ఉప్మా అంటే ఇష్టం. 

Thursday, 27 February 2014

ఆమెకు కొద్దిగా మీసం ఉంది కదా.. మీసం ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Moustache (మష్టాష్ ) : మీసం, An unshaven growth of hair on the upper lip.

Why are you growing a moustache such way ?
నీవు ఎందుకల మీసాన్ని పెంచుతున్నావు ?

Look at her, she has a pencil -thin moustache on her upper lip.
ఆమెని చూడు.. ఆమెకు కొద్దిగా మీసం ఉంది కదా.


Wednesday, 26 February 2014

Fat cat ను తెలుగులో ఏమంటారు?

Fat cat : ధనవంతుడు, wealthy and powerful person.

He is a fat cat. Why do you compare to him?
అతను ధనవంతుడు. అతని తో ఎందుకు పోల్చుకుంటావు?


Tuesday, 25 February 2014

Duck soup ను తెలుగులో ఏమంటారు?

Duck soup : an easy task. చాల సులభం, చాలా తేలిక. 

I think..  making a cake is a duck soup for you.
కేకు ను తాయారు చేయడం నీకు చాలా సులభం అనుకుంటా. 

Why do you worry? that's a duck soup man.
ఎందుకు కంగారు పడతావు? అది చాలా సులభం బాబు. 


Monday, 24 February 2014

వాడో మూర్ఖుడు... మూర్ఖున్ని ఇంగ్లీష్ లో ఏమంటాం?

Dork (n) : మూర్ఖుడు. Socially inept person. 

How did you believe such a dork?
అలాంటి మూర్ఖున్ని ఎలా నమ్మావు? 

Sunday, 23 February 2014

How many childrens do you have? ఈ వాక్యం కరెక్టేనా?

The plural form for the noun child is children.

Child : Children

How many childrens do you have?
How many children do you have? 

My childrens are playing.
My children are playing.

Saturday, 22 February 2014

శుద్ధ మొద్దును ఇంగ్లీష్ లో ఏమంటాం?

Dingbat :  శుద్ధ మొద్దు. A stupid or eccentric person.

He is a dingbat, doesn't no even how to calculate that.
వాడో  శుద్ధ మొద్దు, దాన్ని గణించటం కూడా వానికి తెలవదు. 

Who told you that i am a dingbat?
నేను శుద్ధ మొద్దు అని నీకు ఎవరు చెప్పారు ?

Friday, 21 February 2014

Lucky devil ను తెలుగులో ఏమంటారు?

Lucky devil : అదృష్టవంతుడు, Used to express envy at someone else's good fortune.

అదృష్టవంతుడు : Lucky fellow అని కూడా అంటాం.
కానీ... Lucky devil ను ఈర్ష తో ఎదుటి వారు అదృష్టవంతులు  అని చెప్పే సమయంలో ఉపయోగిస్తాం.

Pranay  is a lucky devil as he won a bike in a lucky draw.
ప్రణయ్ అదృష్టవంతుడు కావడం తో వానికి లక్కీ డ్రాలో బైక్ లభించింది. 


Thursday, 20 February 2014

రెచ్చగొట్టటం ను ఇంగ్లీష్ లో ఏమంటాం?

Provoke(v) : రెచ్చగొట్టుట. 

Why do you try to provoke me?
నన్ను రెచ్చగొట్టటానికి ఎందుకు ప్రయత్నిస్తావు?

Don't provoke him, don't you know about him?
అతణ్ణి రెచ్చగొట్టకు.. అతని గురుంచి తెలవదా నీకు ?

Wednesday, 19 February 2014

Smart cookie ని తెలుగులో ఏమంటారు?

Smart cookie : చాలా తెలివైన వాడు. Someone who is clever at dealing with difficult situations.

He is a smart cookie, he can only solve your problem.
అతను చాలా తెలివైన వాడు.. అతనే నీ ప్రాబ్లం ను పరిష్కరించగలడు.

I have never seen such a smart cookie.
నేనెప్పుడు అంతటి తెలివైన వాడిని చూడలేదు. 
 

Tuesday, 18 February 2014

Negative Words ( You Must Know )


No :
I have no idea on that .
నాకు దాని గురించి తెలవదు.

'No two plants are alike'.
ఏ రెండు చెట్లు ఒకలా వుండవు.

Not :
I told you not to tell him.
అతనికి చెప్పద్దని నీకు చెప్పాను.

Nothing :
I have nothing to say.
చెప్పటానికి ఏమి లేదు.

Never :
I never ask him.
నేను అసలు అతన్ని అడగను.

Nowhere :
I found that book nowhere.
నాకు ఆ పుస్తకం ఎక్కడ  దొరకలేదు. 
There is nowhere for her to sit.
ఆమెకు కూర్చోటానికి ఎక్కడ చోటే లేదు.

No one :
'He told no one he was going'
వెళుతున్నానని..  అతను ఎవరికీ చెప్పలేదు. 

Nobody :
Nobody was at home.
ఇంట్లో  ఎవరు లేకుండే.

Neither :
I take neither tea nor coffee.
నేను టీ త్రాగను.. కాఫీ త్రాగను.

None
None of you called  me yesterday.
 మీలో ఎవరు నాకు నిన్న ఫోన్ చేయలేదు. 


Monday, 17 February 2014

బొంగురు గొంతు.. ను ఇంగ్లీష్ లో ఏమంటాం?

Hoarse : Rough or grating in sound. బొంగురు.

Hoarse throat : బొంగురు గొంతు.

Hey pavani... what's that hoarse throat.
పావని ఏంటి  ఆ.. బొంగురు గొంతు..  

Haa... i am suffering from throat infection.
అవును .. గొంతు infection తో బాధపడుతున్నాను. 

Sunday, 16 February 2014

తప్పక తెలుసుకోవాల్సిన " SHOULD " Examples.

Should  అనేది helping verb.
ఈ helping verb ని మనం చేయ వలసిన పనులకు, బాధ్యతను తెలియ చేయటానికి ఉపయోగిస్తాం. 

Examples: 


I should go to Nizamabad.
నేను నిజామాబాద్ వెళ్ళాలి.  

I should finish my project work now.
నేను ఇప్పుడు ప్రాజెక్ట్ పని పూర్తి చేయాలి.

We should utilize our free time.
మన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోవాలి.


We should learn how to behave with others.
మనం  ఇతరులతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి.

We should respect our parents.
మనం మన parents ను గౌరవించాలి.

We should encourage others.
మనం ఇతరులను ప్రోత్సహించాలి.


You shouldn't discourage others.
మనం ఇతరులను నిరుత్సాహ పరచద్దు.

We shouldn't go there now. 
మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళకూడదు.

We shouldn't interfere in  that issue.
మనం ఆ విషయం లో జోక్యం చేసుకోకూడదు.


Why should i go there?
నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి ?

How long should i wait here?
ఎంతసేపు నేను ఇక్కడ వేచి వుండాలి ?

Why shouldn't she come here?
ఆమె ఇక్కడికి ఎందుకు రాకూడదు ?

You shouldn't smoke so much. It's not good for your health.
నీవు ఎక్కువ పొగ తాగకూడదు .. ఇది నీ ఆరోగ్యానికి మంచిది కాదు.

He shouldn't have smoked so much. That's what caused him health problems. 

అతడు అంత పొగ తాగి ఉండాల్సింది కాదు.. అందుకే అతను ఆరోగ్య సమస్యలతో తో బాధ పడుతున్నాడు.

I think Rakesh
should be in karimnagar by now. (Expectation)
రాకేశ్ ఇప్పుడు కరీంనగర్ లో ఉంటాడు అనుకుంటున్నా..

I shouldn't be so rude, if I were you.

మీరే నేనైతే... మీ అంత దురుసుగా నేనుండను.

Saturday, 15 February 2014

చప్పిడి ముక్కు (నడ్డి ముక్కు) ను ఇంగ్లీష్ లో ఏమంటాం?

Snub nose : చప్పిడి ముక్కు , నడ్డి ముక్కు Having a blunt nose.

Hey divya..look at that snub nosed guy.
దివ్య... అ చప్పిడి ముక్కొన్ని చూడు.


Friday, 14 February 2014

చిరకాల కోరికను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Long cherished desire : చిరకాల కోరిక. 

It's my long cherished desire to become a great director at any cost.
ఎలాగైనా నేనో గొప్ప దర్శకున్ని కావాలనేది నా చిరకాల  కోరిక.

It's my long cherished desire to see potala palace.
పోటలా పాలస్ ను చూడాలనేది నా చిరకాల కొరిక.

Thursday, 13 February 2014

She is having a headache....ఈ వాక్యం కరెక్టేనా?

She is having a headache. ఈ sentence తప్పు.

She has a headache.She isn't coming down for dinner.
ఆమె తలనొప్పితో ఉంది. . ఆమె డిన్నర్ కు రావటం లేదు.. 

She is having a cold.
She has a cold.

I am having dinner. (correct) ఎందుకంటే... ongoing action కాబట్టి. 
She is having a headache. (wrong) ఎందుకంటే... It's not an action .

Wednesday, 12 February 2014

రేపు నీ బట్టలు నీవే ఉతుక్కోవాలి.. చాకలి ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Laundress : చాకలది. A woman who is employed to launder clothes.

Laundress won't come tomorrow. You have to wash your clothes.
( రేపు చాకలది రాదు. రేపు నీ బట్టలు నీవే ఉతుక్కోవాలి.)

Tuesday, 11 February 2014

మీ అయన నీ కొరకు ఎపుడైనా పూలు తీసుకొస్తారా?... ఇంగ్లీష్ లో ఎలా?

Once in a blue moon : ఎప్పుడో ఒకసారి... Rarely. 

Does your husband ever bring you flowers?
మీ అయన నీ కొరకు ఎపుడైనా పూలు తీసుకొస్తారా?

He brings me flowers once in a blue moon.
ఎప్పుడో.. ఒకసారి నా కొరకు పూలు తీసుకొస్తాడు.

I go to my native place once in a blue moon.
ఎప్పుడో.. ఒకసారి నేను నా స్వంత వూరికి వెళుతాను. 

Once in a blue moon.. i buy a fashion magazine
ఎప్పుడో.. ఒకసారి నేను ఫాషన్ పత్రిక ను కొంటాను.Monday, 10 February 2014

Red letter day.... ను ఇంగ్లీష్ లో ఏమంటాం?

Red letter day : Unforgettable day. మరిచి పోలేని రోజు. 

My mother's birthday is my red letter day.
మా అమ్మ పుట్టిన  రోజు.. నాకు  మర్చిపోలేని రోజు...


Sunday, 9 February 2014

పెళ్లి అంటేనే... భయపడటాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు?

Gamophobia ( పెళ్ళంటే భయం )

He is suffering from gamophobia. Only psychologist can help him.
( పెళ్లి అంటేనే... భయపడుతున్నాడు .  psychologist మాత్రమే అతనికి  సహాయం చేయగలడు.


Saturday, 8 February 2014

చాలా తెలివిగా మోసం చేసేవారిని ఇంగ్లీష్ లో ఏమంటారు?

Clip artist : చాలా తెలివిగా మోసం చేసేవాడు. 

He is a clip artist. We have to be careful.
( ఆతను చాలా తెలివిగా మోసం చేసేవాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. )


Friday, 7 February 2014

ఆమె శారీర రంగు చామన్ చాయ... ఇంగ్లీష్ లో ఎలా?

Wheatish brown : చామన్ చాయ.

Her skin colour is Wheatish brown. 
( ఆమె శారీర రంగు చామన్ చాయ)  

Thursday, 6 February 2014

అసలే మద్యం ( alcohol ) తాగని వారిని ఇంగ్లీష్ లో ఏమంటాం?

Teetotaler : A Person who never drinks alcohol. మద్యం తాగని వాడు. 

Don't force him to drink.. he is a teetotaler.
అతన్ని తాగు మని ఒత్తిడి చేయకు... అతను  అసలు మద్యం ముట్టడు.


Wednesday, 5 February 2014

చాలా లేటుగా..నిద్ర లేచే వారిని ఇంగ్లీష్ లో ఏమంటాం?

Late riser : లేటుగా నిద్ర లేచే వారు .Someone who usually gets out of bed late.

He is a late riser.
అతను చాలా లేటుగా నిద్ర లేస్తాడు. 

Early riser : త్వరగా నిద్ర లేచే వారు .Someone who usually gets out of bed early.

She is a early riser.
ఆమె  చాలా త్వరగా  నిద్ర లేస్తుంది.
 
చాలా లేటుగా నిద్ర పోయేవారిని Night owl అంటాం. 


Tuesday, 4 February 2014

Rain is coming... ఈ వాక్యం కరెక్టేనా?

చాలా మంది... వర్షం పడుతుంది అని చెప్పటానికి... Rain is coming
అని చెబుతారు. అది తప్పు.

Rain is coming
It's raining (correct)


Monday, 3 February 2014

ఆమె అధిక ప్రసంగాన్ని నీవు భరించలేవు.. అధిక ప్రసంగాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు?

Verbose : ఆధిక ప్రసంగం. Using more words than needed.

Please Stop your verbose.
దయచేసి మీ అధిక ప్రసంగాన్ని ఆపండి. 

You can't bear her verbose.
ఆమె అధిక ప్రసంగాన్ని నీవు భరించలేవు. 

 

Sunday, 2 February 2014

నా వీపును గోకుతారా.. గోకటం ను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Scratch : గోకుట, గోకుడు 

Can you  scratch my back Please?
దయచేసి... మీరు నా వీపును గోకుతారా? 

Saturday, 1 February 2014

Proverbs

A belly full of gluttony will never study willingly.
( కడుపు నిండా తిన్నవాడు ఇష్టంగా చదవలేడు )

A cat in gloves catches no mice.
(  బోనులో ఉన్న పిల్లి ఎలుకల్ని పట్టలేదు )

A constant guest is never welcome.
( తరుచుగా వచ్చే అతిధిని ఎవరు ఆహ్వానించరు )

A friend is never known till needed.
( అవసరం పడేదాకా స్నేహితుని అసలు గుణం తెలియదు )

A golden key can open any door.
( మంచిమాటలకు మాన్యాలు దక్కు )

A good begining makes a good ending.
( మంచి ప్రారంభం, శుభంతో ముగుస్తుంది )

A good husband must be deaf, a good wife must be blind.
( మంచిభర్త చెవిటివాడి గానూ, మంచి భార్య గుడ్డి దానిలా వ్యవహరించాలి )

A good wife makes a good husband.
( మంచి పెళ్ళాం మంచి మొగుణ్ణి తయారు చేస్తుంది )

A happy heart is better than a full of purse.
( జేబు నిండా డబ్బులకన్న సంతోషమైన గుండె మేలు )

A honey tongue, a heart of gall.
(మాటల్లో అమృతం, మనసులో విషం )

A hungry man is an angry man.
( ఆకలితో ఉన్న వాడికి కోపం ఎక్కువ )

A lie begets a lie.
(అబద్దానికి  అబద్దమే బిడ్డ )

A little neglect may breed endless mischief.
( చిన్న అశ్రద్ద పెద్ద ప్రమాదాన్ని సృష్టించవచ్చు  )

A man without a smiling face must not open a shop.
( నవ్వు మొహం లేని మనషి  వ్యాపారం చేయకూడదు )

A pessimist sees a calamity in every opportunity.
( నిరాశావాది  ప్రతి దాంట్లో కీడునే చూస్తాడు )

A belly full of gluttony will never study willingly.
( కడుపు నిండా తిన్నవాడు ఇష్టంగా చదవలేడు )

A ready way to lose a friend is to lend him money.
( మిత్రుణ్ణి దూరం చేసుకోవాలంటే అప్పు ఇవ్వడమే మార్గం )

A week foundation destroys the work.
( పునాది గట్టిగ లేకుంటే మొత్తం పని పాడవుతుంది )

A woman 's mind and winter wind change oft.
( ఆడవారి మనసూ, శీతాకాలం గాలి తరుచూ మారుతాయి )

A word hurt more than a wound.
( గాయం కంటే మాట ఎక్కువ బాధిస్తుంది )

All  criminals turn preacher when under the gallows.
( ఉరితాడు కింది నేరగాళ్ళు  అందరూ వేదాంతం చెప్పేవాళ్లే )

An old fox needs no craft.
(ముసలి నక్కకు జిత్తులు నేర్పాలా ? )

Be as you would seems to be.
( నీవు ఎలా వుండాలని కోరుకుంటావో అలానే వుండు )

A belly full of gluttony will never study willingly.
( కడుపు నిండా తిన్నవాడు ఇష్టంగా చదవలేడు )

Be not too bold with your betters.
( నీకంటే అధికులతో అతి దూకుడు వద్దు )

Be slow to promise, quick to perform.
( ఆచి తూచి మాట ఇవ్వు, ఐతే తొందరగా నెరవేర్చు )

Begin in time to finish without hurry.
(సరైన వేళలో మొదలుపెట్టు, హడావుడి లేకుండా పూర్తవుతుంది )

Best to bend while 'tis' a twig.
( మొక్కగా వుండగానే వంచడం సులువు )

Better master one than engage with ten.
( మందితో పాట్లు పడేకంటే ఒక్కడికి యజమానిగా వుంటే మంచిది )

Better sit idle than work for nothing.
( కాసులు రాని పనిచేయటం కంటే ఖాళీగా వుండటం మంచిది )

Beware of a silent dog and still water.
( మొరగని కుక్క, నిలిచిన  నీరు విషయములో జాగ్రత్తగా వుండు )

Buy in the cheapest market and sell in the dearest.
( చవగ్గా కొను  అధిక ధరకు అమ్ము; ఇదే వ్యాపార రహస్యం )

Cheat me in the price but not in the goods.
( ధర విషయంలో మోసం చేయు..  కానీ  వస్తువుల విషయంలో కాదు )

Children and chicken must be always picking.
( పిల్లలు, కోడి పిల్లలు ఎప్పుడూ ఏదో గెలుకుతూనే ఉంటారు )

Coming events cast their shadows before them.
( చెడు దాపురించే  మిందు వాటి శకునాలు ముందుగా కనపడుతాయి )

Constant complains never get attention.
( నిత్యం ఏడ్చే వాడిని పట్టించుకునే వారుండరు )

Dally not with money or women.
(డబ్బును, ఆడవాళ్ళను  చులకన చేయవద్దు )

Deeds are fruits, words are but leaves.
( మాటలు ఆకుల వంటివి చేతలు ఫలాల వంటివి )

There are many persons... జాగ్రత్తగా చూడండి... ఈ వాక్యం కరెక్టేనా?

Person ఈ పదానికి Plural Persons  కాదు.. People.

Person : People

There are many persons.
There are many people.

English Books :