Friday, 31 January 2014

శాకాహారులే కానీ, ఎప్పుడైనా మాంసం, చేపలు తింటారు ...వీరిని ఏమంటారో తెలుసా?

Flexitarian : A Vegetarian who sometimes eats meat or fish.

She is a flexitarian.
( ఆమె శాకాహారి కానీ, ఎప్పుడైనా మాంసం, చేపలు తింటుంది.)

Thursday, 30 January 2014

అతను ఆన్ లైన్ షాపింగే చేస్తాడు...అలాంటి వారిని ఇంగ్లీష్ లో ఏమంటారు?

Couch commerce : Buying goods online from one's home.

He is a couch commerce. He never goes to shop to buy goods.
(అతను ఆన్ లైన్ షాపింగే చేస్తాడు.అసలు షాప్ ల జోలికే వెళ్ళడు.)

Wednesday, 29 January 2014

నీరజ వయసులో కనిపించేంత చిన్నది కాదు... ఇంగ్లీష్ లో ఎలా?

Neeraja is not so young as she looks.
(నీరజ వయసులో కనిపించేంత చిన్నది కాదు.)

Naveen is not so young as he looks.
(నవీన్  వయసులో కనిపించేంత చిన్నోడు కాదు.)

Tuesday, 28 January 2014

Cooking skills అనటం పాత ఫాషన్... కొత్తగా ఇంకో విధంగా...

Culinary skills : వంట చేయటం లో నేర్పు. Cooking skills,

She has good culinary skills.
(ఆమె వంట చేయడం లో మంచి నేర్పరి) 

Monday, 27 January 2014

Vegetarian అంటే శాకాహారి.... మరి vegan అంటే ఏమిటి?

Vegan  :  శాకాహారి. ( Vegans don't eat even animal products like milk, cheese...etc)

Vegans don't eat animal products like milk, cheese...etc. 
Vegan అంటే...శాకాహారే.. కానీ animal products తీసుకోరు.milk, cheese, honey... etc. )

I'm a vegan :  నేను పూర్తి శాకాహారి.

Sunday, 26 January 2014

వాడో తిండిబోతు...ఇంగ్లీష్ లో ఎలా?

Glutton : తిండిబోతు. an excessively greedy eater.

He is a glutton, he eats around 13 chapatis for dinner.
(వాడో తిండిబోతు, రాత్రి భోజనం లో 13 రొట్టెలు తింటాడు.) 

Saturday, 25 January 2014

వీపరీతమైన ఆకలి... ఇంగ్లీష్ లో ఎలా?

Famished : Extremely hungry. చాలా ఆకలితో వుండటం. 

I'm famished. is there anything to eat?
( నేను చాలా ఆకలితో ఉన్నాను... ఏదైనా తినటానికి వుందా? ) 

Friday, 24 January 2014

Copmuter technology లో చాలా తెలివి ఉన్నవారిని ఇంగ్లీష్ లో ఏమంటారు?

Tech savvy : Very good knowledge of technology.

He is a tech savvy. He can explain you clearly about that.
( అతనికి కంప్యూటర్ విజ్ఞానం చాలా వుంది. అతను నీకు దాని చాలా బాగా వివరించగలడు)

Thursday, 23 January 2014

TV కి అతుక్కుపొయేవారిని... ఇంగ్లీష్ లో ఏమంటారు?

Couch Potato :  A person who takes little or no exercise and watches a lot of television,

TV కి అతుక్కుపొయేవారిని, కూర్చున్న చోట నుండి లేవకుండా.... టీవీ చూస్తూ వుండే వాళ్ళను 
Couch Potato అంటారు.

She is a couch potato.

Wednesday, 22 January 2014

నీ అంతరాత్మకు అన్ని తెలుసు... ఇంగ్లీష్ లో అంతరాత్మను ఏమంటారు?

Conscience : అంతరాత్మ,  A person's moral sense of right or wrong.

Your conscience knows everything.
( నీ అంతరాత్మ కు అన్ని తెలుసు.) 

Tuesday, 21 January 2014

మొలతాడును ఇంగ్లీష్ లో ఏమంటారు?

Waist string  : మొలతాడు. 

Nose - ring : ముక్కు పుడక. 

Wristlet : కంకణం. 

Monday, 20 January 2014

చాలా కష్టాలు ఉన్నా... ప్రశాంతంగా ఉన్నాడు....ఇంగ్లీష్ లో ఎలా ?

Cool as a cucumber : ప్రశాంతంగా వుండటం. 

He is cool as a cucumber though he has many problems.
(అతనికి చాలా  కష్టాలు ఉన్నప్పటికీ.. ప్రశాంతంగా ఉన్నాడు.)

Sunday, 19 January 2014

సాంబార్ రుచి చెత్తగా వుంది... ఇంగ్లీష్ లో ఎలా?

Crummy : Dirty, Unpleasant, చెత్తగా

Sambar tastes crummy.
(సాంబార్ రుచి  చెత్తగా వుంది .)

How could you  eat such a crummy curry?
( అంత చెత్త కూర ను ఎలా తినగలిగావు ? )

Saturday, 18 January 2014

ఆమె తిట్లను నీవు భరించలేవు... ఇంగ్లీష్ లో ఎలా?

Abuses : తిట్లు 

Stop! your abuses.  
(నీ తిట్లను ఆపవయ్య బాబు..)

You can't bear her abuses.
( ఆమె తిట్లను నీవు భరించలేవు)


Friday, 17 January 2014

తల తిరుగుతున్నట్టు ఉంది... ఇంగ్లీష్ లో ఎలా?

Dizzy : తల తిరగటం. a feeling that you are about to fall.

I feel dizzy. (తల తిరుగుతున్నట్టు ఉంది) 

Thursday, 16 January 2014

పెళ్లి చూపులను .... ఇంగ్లీష్ లో ఏమంటారు?

Bridal meet : పెళ్లి చూపులు,

I'm going to my native place for bridal meet.
( పెళ్లి చూపుల కొరకు  నేను మా ఊరు వెళుతున్నాను. ) 

Wednesday, 15 January 2014

32 ఏళ్ల పైనే వున్నా... ఆమె టీనేజ్ అమ్మాయి లాగే కనబడుతుంది.ఇంగ్లీష్ లో ఎలా?

She is over 32 years of age but looks like a teenager.
(ఆమె వయస్సు 32 ఏళ్ల కన్నా ఎక్కువ వున్నా... ఆమె టీనేజ్ అమ్మాయి లాగే కనబడుతుంది)

ఇక్కడ "over " ఎక్కువ అని చెప్పటానికి ఉపయోగిస్తాం.

" over " ఇంకో విధముగా...

I think the book costs over Rs 100. 
( అ పుస్తకం ఖరీదు 100 పైనే ఉంటుందనుకుంటున్నా. )

I waited there over one hour for you.
( గంటకు పైనే నీ కొరకు అక్కడ వేచి ఉన్నాను. )

Tuesday, 14 January 2014

backside ఉపయోగించే సమయంలో చాలా జాగ్రత్త !

మాములుగా... మనం అ షాప్ వెనుక, కాలేజీ వెనుక సైడ్ అన్నప్పుడు "backside"
అని ఉపయోగిస్తాం. ఇది చాలా  తప్పు... ఎందుకంటే backside అంటే పిరుదులు. 

 అ షాప్ వెనుక, కాలేజీ వెనుక సైడ్ అన్నప్పుడు " at the back of " ఉపయోగించాలి.

My sister sat at the back of the car.
( నా చెల్లి కార్ వెనుక భాగములో కూర్చుంది)

Our  house is at the back of nandita college.
( మా ఇల్లు నందిత కాలేజీ వెనుక వైపున వుంది)

Monday, 13 January 2014

ఇల్లు మారే సమయంలో ... shift or move ఏది ఉపయోగించాలి ?

చాలా మంది... ఇల్లు మారే సమయంలో Shift అనే పదాన్ని ఉపయోగిస్తారు. 
shift బదులు Move అనే పదాన్ని ఉపయోగించండి.

Move : Change one's place of residence.

They are moving to new house tomorrow.
(వారు రేపు ఇల్లు మారుతున్నారు)

She will move to new flat next week. 
(ఆమె  వచ్చేవారంలో  కొత్త ఫ్లాట్ లోకి మారుతుంది)

shift : Move from one place to another, especially over 
a small distance. 

(టీవీ ని ఒక రూం నుండి ఇంకో రూం లోకి మార్చినపుడు,  
small distance.... లో  "Shift" ను ఉపయోగించవచ్చు. )

Sunday, 12 January 2014

"దేవుని దయవల్ల" అంటుంటాం.... ఇంగ్లీష్ లో ఎలా?

By God's grace: దేవుని దయవల్ల. 

By God's grace, i am very happy.
( దేవుని దయవల్ల, నేను చాలా సంతోషంగా ఉన్నాను)

By God's grace, i got  a job.
( దేవుని దయవల్ల, నాకు ఉద్యోగం వచ్చింది)

Saturday, 11 January 2014

నీ కాకమ్మ కథను ఆమె ఎలా నమ్మిందయ్యా బాబు? ఇంగ్లీష్ లో ఎలా?

cock- and-bull stories : కాకమ్మ కథలు. made-up story, a story that is a lie.

 Manager won't believe your cock-and-bull stories.
(నీ కాకమ్మ కథలను మేనేజర్ నమ్మడు.)

How did she believe your cock-and bull story?
నీ కాకమ్మ కథను ఆమె ఎలా నమ్మిందయ్యా బాబు?


Friday, 10 January 2014

కొందరు చాలా late గా రాత్రి నిద్రపోతారు...వాళ్ళను ఇంగ్లీష్ లో ఏమంటారు?

Night owl : Late sleeping.

కొందరు బుక్ చదువుతూ,  టీవీ చూస్తూ, ఫోన్లో సొల్లు కొడుతూ... చాలా  late గా రాత్రి నిద్రపోతారు. ఇలాంటప్పుడు
"Night owl" అని ఉపయోగిస్తాం.

My roommate is a night owl usually watches T.V until 2 A.M.
నా రూమ్మేట్ రాత్రి రెండు గంటల వరకు టీవీ చూసి అప్పుడు పడుకుంటాడు.

Thursday, 9 January 2014

మనం ఒక్కోసారి ... నిద్రలోకి జారుకుంటాం... ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి?

Doze off : పడుకోవటం, Fall asleep.

టివి చూస్తున్నపుడు, బుక్ చదివే టైం లో, ప్రసంగం వింటున్న సమయములో
మనం నిద్రలోకి జారుకుంటాం... అలాంటి సమయం లో  Doze off ఉపయోగిస్తాం  .

I dozed off while watching T.V
టివి చూస్తునే... నేను నిద్రలోకి జారిపోయాను. 

I dozed off while reading book.
బుక్ చదువుతూనే... నేను నిద్రలోకి జారిపోయాను. 

Wednesday, 8 January 2014

It's my mistake అనటం సర్వసాధారణం. కానీ ఇంకోవిధంగా...

Flaw : Mistake, లోపం. 

It's my mistake
అనటం సర్వసాధారణం.
Latest గా Flaw అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు.

It's my flaw  = It's my mistake. 

Tuesday, 7 January 2014

బాగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ? ఇంగ్లీష్ లో ఎలా?

Make a bundle : బాగా డబ్బు సంపాదించటం, To make a lot of money.

He made a bundle in share market.
(అతడు షేర్ మార్కెట్ లో బాగా డబ్బు సంపాదించాడు.)

I wold like to make a bundle and retire.
(బాగా డబ్బు సంపాదించి రిటైర్ కావాలనుకుంటున్నాను)


Monday, 6 January 2014

One of my friend told that.ఇది కరెక్ట్ అనిపిస్తుందా?

చాలా మంది... One of my friend told that. అంటారు.
ఇది కరెక్ట్ అనిపిస్తుందా? తప్పు.

one of my friends told that. ఇది కరెక్ట్. 
ఎందుకంటే.. one of my friend అంటే... ఒక ఫ్రెండ్ అంతే...
దానికి one of my friend అనే అవసరం ఏముంది?
My friend told me. అని అంటే సరిపోతుంది. 

one of my friends told that. అంటే.. నాకు చాల మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. 
వారిలో ఒకరు చెప్పారు అని అర్థం వస్తుంది.

Sunday, 5 January 2014

హైదరాబాద్ లో నీవు ఉద్యోగం లేకుండా బ్రతకగలవా? ఇంగ్లీష్ లో ఎలా?

Get by : To survive ( బ్రతకటం )

Can you get by without a job in Hyderabad.
హైదరాబాద్ లో నీవు ఉద్యోగం లేకుండా బ్రతకగలవా? 

I will explain you.. how to get by in Hyderabad?
హైదరాబాద్ లో ఎలా బ్రతకాలో... నేను వివరిస్తాను.

Saturday, 4 January 2014

I am going to home ఈ వ్యాక్యం కరెక్టేనా ?

చాలా మంది Home ముందు "to" ఉపయోగిస్తారు. కానీ ఉపయోగించకూడదు. 
i am going to home. ఇలా రాయటం తప్పు.

i am going to home
I am going home ( correct )

I go home.
I go shopping ( I go to shop అనవచ్చు )

Friday, 3 January 2014

వాడు ఎప్పుడు గొడవలు పెటుకొని చస్తాడు.. ఇంగ్లీష్ లో ఎలా?

Bad egg : A bad person, జగడాలోడు, ఎప్పుడు గొడవలు పెట్టుకొనేవాడు.

 Don't invite him to the party, he is a bad egg.
(పార్టీ కి వాణ్ని ఆహ్వానించకు.. వాడో జగడాలోడు.)

He is a bad egg. It's better to not invite him to the party.
(
వాడో జగడాలోడు. వాణ్ని పార్టీ కి వాణ్ని ఆహ్వానించక పోవటమే మంచిది )

Thursday, 2 January 2014

అహా... ఏమి గొంతెమ్మ కోరికలు బాబు... ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి ?

Ask for the moon : గొంతెమ్మ కోరికలు కోరటం, ఆసాధ్యమైన కోరికలు కోరటం. 

Surya is demanding for 50% share in your company.
(మీ కంపెనీలో సూర్య 50% వాటాను డిమాండ్ చేస్తున్నారు )

అలా డిమాండ్ చేసినప్పుడు... మీరు " Ask for the moon" ను ఉపయోగించవచ్చు.

you are asking for the moon... it's not possible to give 50% share.
(నీవు గొంతెమ్మ కోరికలు కోరుచున్నావు....
50% వాటా ఇవ్వటం ఆసాధ్యం)

Wednesday, 1 January 2014

అప్పుడప్పుడు " నీ మట్టిబుర్ర తో చస్తున్నా" అంటాం .. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో ఎలా?

Airhead :  మట్టిబుర్ర.

He is an airhead. He cannot understand even simple things.
(వాడో.. మట్టిబుర్ర. చిన్న చిన్న విషయాలను  కూడా అర్థం చేసుకోలేడు.)

You are killing me with your airhead.
(నీ మట్టిబుర్ర తో.... చంపేస్తున్నావు.. )

English Books :